తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని తెలంగాణ భక్తుల నుంచి రూ. 4 లక్షలు ఆన్ లైన్ ద్వారా వేసుకున్నారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారీ అయ్యాడు. దీంతో ఓ భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.