‘శ్రీ చైతన్య’ పేరుతో మోసం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగర శివారులోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో పూర్తిగా నిర్మాణం కాని భవనాన్ని చూపుతూ శ్రీ చైతన్య పేరుతో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారని టీజీవీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజవాణిలో అదనపు కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలకే సరైన అనుమతులు లేకపోగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో భవనాన్ని చూపి విద్యాశాఖ అధికారులనుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్స్ చేసి విద్యార్థుల తల్లి తలిదండ్రులను...