Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 1:38 pm Posted by : ramakrishna

గణేష్ నిమజ్జన ఊరేగింపులో తల్వార్‌తో హల్చల్ చేసిన నలుగురు యువకులు అరెస్ట్

 

. . . రిమాండ్‌కు తరలింపు

కొత్తగూడెం, బతుకమ్మ :

కొత్తగూడెం టూ టౌన్ పరిధిలో గరీబ్‌పేటలో నిమజ్జన ఊరేగింపులో మారణాయుధంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించి పోలీసులు నిందితులను చిత్తరి లింగాప్రసాద్, పల్లె సతీష్, గోగుల నవీన్,భూక్య గణేష్‌ లను అరెస్టు చేశారు. పండుగల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులు ప్రజలకు ఇబ్బంది కలిగించే మారణాయుధాల ప్రదర్శనలు, అసాధారణ చర్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.