మాక్లూర్, బతుకమ్మ : కరెంట్ షాక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలిక మంగళవారం మృతి చెందింది. మాక్లూర్ ఎస్ఐ కథనం ప్రకారం.. మాక్లూర్ మండలం దుర్గానగర్ సింగంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎలియా నాయక్ తాండాలో భాణావత్ మనస్వీ (4) బందువుల ఇంటిలో ఏప్రిల్ 3న ఆడుకుంటు ఎలక్ట్రిక్ హీటర్ ను ముట్టుకొని కరెంట్ షాక్ కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైధ్యం కోసం హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు ఉదయం చనిపోయింది. బాలిక తండ్రి భాణవాత్ విజయ్ కుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.