. . . ఆరుగురి అరెస్టు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ కు పాల్పడిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి సిఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 17న ఆదిత్య తన నాలుగేళ్ళ కుమారుడు ధనుష్ కిడ్నాప్ అయ్యాడని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి, కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసి బాలుడి ఆచూకీని గుర్తించినట్లు సిఐ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా అప్పగించామన్నారు. ప్రజలు తమ గ్రామాల్లో, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని సిఐ కోరారు.