నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని బస్టాండ్ ఎదురుగా గల శ్రీసాయి మెస్ లో శనివారం అర్థరాత్రి న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించిన నలుగురికి జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. జంగిటి విశాల్, బజ్జుల్వర్ గోవింద్, సందనాల సాయికుమార్, కాలే నవనాథ అనే నలుగురు వ్యక్తులు న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించారని తెలిపారు. సిటీ పోలీస్ ఆక్ట్ కింద వారపై కేసు నమోదు చేసి మంగళవారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జీ ముందు హాజరు పరుచగా ఒక్కొక్కరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.