Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 5:30 pm Posted by : ramakrishna

డ్రంకైన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు శిక్ష

 

బోధన్, బతుకమ్మ :

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు  సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి  న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. చిక్కడపల్లి గ్రామానికి చెందిన శేఖర్, పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేష్ వర్మలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి  ముందు హాజరుపర్చగా, ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.శక్కర్ నగర్ కాలనీకి చెందిన షేక్ అయూబ్ ,మూల వినోద్ ఇద్దరు మద్యం మత్తులో పలుమార్లు డయల్ 100 కి కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు, వారికి ఒక రోజు జైలు శిక్ష విధించారు. బోధన్ పోలీసులు ప్రజలను ఎటువంటి మద్యం మత్తులో చట్ట విరుద్ధంగా ప్రవర్తించకండని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని బోధన్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ తెలిపారు.