Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 5:36 pm Posted by : ramakrishna

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

 

జుక్కల్, బతుకమ్మ

 

జుక్కల్ మండలంలోని పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో వారి సిబ్బంది సావర్ గావ్ గ్రామ శివారులో సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, రూ.2520 నగదుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామంలో ఎవరైనా పేకాట, మట్కా వంటి ఆటలు ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై నవీన్ చంద్ర హెచ్చరించారు.