Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2024, 6:44 pm Posted by : ramakrishna

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ ; పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం వారి సిబ్బంది లక్ష్మణ్, రాజేశ్వర్, సుదర్శన్, అనిల్ కుమార్, నర్సయ్య ,ఆజాములు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని తీర్మన్ పల్లీ శివార్ లో పేకాట స్థావరం పై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 4 గురు పేకాట రాయుళ్ల ను పట్టుకొని వారి వద్ద నుంచి 4సెల్ ఫోన్లు, రూ . 18400 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై తదుపరి చర్య నిమిత్తం ఇందల్వాయి పోలీసులకు అప్పగించారు.