డ్రంకన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు
నిజామాబాద్, బతుకమ్మ : డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన నలుగురికి జైలు శిక్ష, 14 మందికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్ స్పె క్టర్ పి. ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ఎదుట హాజరు పర్చగా నలుగురికి జైలు శిక్ష, 14 మందికి రూ. 21,000 జరిమానా విధించారని వెల్లడించారు.