Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 6:12 pm Posted by : ramakrishna

బ్యాక్ వాటర్ లో నలుగురు గల్లంతు

 

… శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన ఆటో నగర్ యువకులు

 

.. నలుగురూ గల్లంతు.. ముగ్గురు మృతదేహల వెలికితీత

 

.. గజ ఈతగాళ్లతో గాలింపు

 

బాల్కొండ, బతుకమ్మ :

 

గోదావరి నదిలో ఈత కొట్టాలన్న యువకుల సరదా వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గోదావరి నదికి స్వల్పంగా వస్తున్నా ఇన్ఫ్లో కు తోడు శ్రీ రాం సాగర్ బ్యాక్ వాటర్ పచ్చిక బయల్లో ఆదివారం ఆనందంగా గడుపాలనుకున్న నలుగురు యువకులు నీటిలో మునిగి గల్లంతు అయ్యారు..

నిజామాబాద్ నగరం కు చెందిన ఐదుగురు యువకులు శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈతకు దిగి గల్లంతు అయ్యారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది.. నగరం లోని ఆటో నగర్ కు చెందిన యువకులు సండే ఎంజాయ్ కోసం ఎస్ ఆర్ ఎస్పీ ప్రాజెక్ట్ కు వెళ్లారు. అందులో ఓ యువకుడు ఈత రాదని గట్టు పై ఉండగా.. నలుగురు ముప్కాల్ మండలం లోని లక్ష్మి కాలువ రెగ్యులేటెర్ వద్ద బ్యాక్ వాటర్ నీళ్లలో దిగారు. ఒకరి తరువాత ఒకరు నీళ్లలో దిగి బ్యాక్ వాటర్ లో మునిగిపోయారు… నలుగురిలో నిజామాబాద్ నగరం లోని ఆటో నగర్ కు చెందిన అజీమ్, అబ్బు, ఖలీం లతో పాటు మహారాష్ట్ర లోని భోకర్ తాలూకా హిమాయత్ నగర్ కు చెందిన రెహన్ నీటిలో గల్లంతు అయ్యారు.. ఖలీమ్, అజీమ్, అబ్బు ల డెడ్ భాడిలని వెలికి తీశారు.. మరో యువకుడు రెహన్ మృతదేహం కోసం గాలిస్తున్నారు గజ ఈతగాళ్ళు..చీకటి కావడం తో రెస్క్యూ టీమ్ కు వాతావరణం అనుకూలంగా లేకున్నా గాలిస్తున్నారు. విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటన స్థలానికి వెళ్లారు..

 

Four missing in backwaters