గొడవ కేసులో నలుగురికి రూ.20వేల జరిమానా

నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేష్లకు ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ ఒక్కరికి రూ.5,000 చొప్పున, మొత్తం రూ.20,000 జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే, 2019లో నీల సిద్ధిరాములు అనే వ్యక్తితో ఇంటి వివాదం కారణంగా ఈ నలుగురి మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై అప్పటి నాగిరెడ్డిపేట్ ఎస్సై మోహన్ నీల సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్...