వెంకటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వసంత పంచమి సందర్భంగా వేయి నామాల వెంకటేశ్వర ఆలయం శంకుస్థాపన చేశారు. ఆలూర్ గ్రామంలో వందలాది సంవత్సరాలుగా వేంకటేశ్వర గుట్టగా ప్రసిద్ధి గాంచిన ప్రాంతంలో సుమారు వెయ్యి రాళ్ళల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం "వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం"గా పిలువబడుతున్నది. ఇక్కడనే మూడు నామాలుగా నిటారుగా నిలబడి ఉన్న మూడు రాళ్ళ గుహ మధ్యలో స్వయంభుగా వెలసిన...