ఆర్మూర్, బతుకమ్మ : ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వసంత పంచమి సందర్భంగా వేయి నామాల వెంకటేశ్వర ఆలయం శంకుస్థాపన చేశారు. ఆలూర్ గ్రామంలో వందలాది సంవత్సరాలుగా వేంకటేశ్వర గుట్టగా ప్రసిద్ధి గాంచిన ప్రాంతంలో సుమారు వెయ్యి రాళ్ళల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం “వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం”గా పిలువబడుతున్నది. ఇక్కడనే మూడు నామాలుగా నిటారుగా నిలబడి ఉన్న మూడు రాళ్ళ గుహ మధ్యలో స్వయంభుగా వెలసిన శంఖు,చక్రం నామాలు కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి,అలాగే ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
