నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కంటేశ్వర్ లో పుర పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న కంటేశ్వర్ సార్వజనిక్ స్మశాన వాటిక శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 19వ డివిజన్ కంటేశ్వర్ సార్వజనిక్ స్మశాన వాటికలో వెయిటింగ్ హాల్ బర్నింగ్ ప్లాట్ఫారం, ప్రహరీ గోడల నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా 27 లక్షల వ్యాయంతో పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. స్మశాన వాటిక నిర్మాణ పనులు నాణ్యతతో త్వరతగతిన పూర్తి చేయ్యాలనీ కాంట్రాక్టర్ కి సూచించారు. స్మశాన వాటిక అభివృద్ధి కి తోడ్పడతా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ మురళి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, తాజ మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, డివిజన్ నాయకులు నాగోళ్ళ రవి, చంద్ర మౌళి, ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్, గుండు రవి, సాయి ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
