Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 4:06 pm Posted by : ramakrishna

అన్నసత్ర నిర్మాణానికి శంకుస్థాపన

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం వెనుక భాగంలో అన్నసత్ర భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన నరసింహారావు, విజయలక్ష్మి దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ అన్నసత్ర నిర్మాణానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ గంగాధరరావు పట్వారి,  బీర్కూరు, బుజ్జి, ఎం.ఎల్. గంగారం, ప్రదీప్ గుప్తా, దామోదర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఏకచక్ర తిరంగా సమితి అధ్యక్షులు మహేశ్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్ పటేల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.విడిసి కమిటీ సభ్యులు సంగ్రామ్, గోశాల కమిటీ అధ్యక్షులు నేపాల్ పురోహిత్, ఆర్యసమాజ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్ చిన్న , బిజెపి పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మిత్రబృందంతో సహా పలువురు హాజరయ్యారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఆలయ కమిటీ అధ్యక్షులు గుండి శంకర్, జిల్లా సహాయక కమిషనర్ విజయ రామారావు, ఆలయ కార్యనిర్వాహక అధికారి  రాములు పాల్గొన్నారు.

Foundation stone laid for construction of Annasatra