Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 6:31 pm Posted by : ramakrishna

కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుంది

 

. . . మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఆరు సంవత్సరాలు లోపు పిల్లలను దత్తత ప్రక్రియ లో భాగం చేయాలని, దత్తత వెళ్లలేని ఆరు సంవత్సరాలు పై బడిన పిల్లలను కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుందని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నిజామాబాద్ జిల్లా బాలసదనంలో ఆశ్రమం పొందుతున్న అమ్మాయిని హైదరాబాద్ లో జరిగినటు వంటి సమావేశంలో సీతక్క చేతుల మీదుగా పోస్టర్ కేర్ ఇచ్చారు.

 

Foster care can be useful in creating a family atmosphere.

 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లలు కుటుంబంలో పెరగాలని, దీనివల్ల సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకుంటారని మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పోస్టర్ కేర్ తీసుకోవడానికి కుటుంబాలు ముందుకు రావాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పోస్టర్ కేర్ ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్ ఘనత సాధించిందన్నారు. ఈ ఘనత సాధించడంలో సహకరించిన నిజామాబాద్ జిల్లా అధికారులని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన్ డైరెక్టర్ శృతి, ఓజ జాయింట్ డైరెక్టర్ మోతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్, గణేష్, ప్రత్యూష, డైరెక్టేట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.