హైదరాబాద్, బతుకమ్మ: ఫార్ముల – ఈ రేసు కేసు ఏసీబీ నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ ను హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ లో మరికాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ హై కోర్టును ఆశ్రయించారు.