Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:43 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటిసీ దుర్మరణం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ జడ్పీ ప్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం జాతీయ రహదారి 44 పై తుప్రాన్ సమీపంలో కారు అదుపు తప్పి పక్కన దూసుకెళ్లి చెట్టును ఢీ కొట్టిన  రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ కు చెందిన నారేడ్డి మోహన్ రెడ్డి గత జిల్లా పరిషత్ పాలకవర్గంలో కాంగ్రెస్ తరుపున ప్లోర్ లీడర్ గా పనిచేశారు. మంగళవారం ఉదయం మోహన్ రెడ్డి, మద్ధికుంటకు చెందిన తిరుపతిరెడ్డి, అన్నారంకు చెందిన రఘోత్తం రెడ్డిలు కారులో హైద్రాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. మోహన్ రెడ్డి ఘటన స్థలంలో చనిపోగా రఘోత్తం రెడ్డి, తిరుపత్ రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. రాజకీయంగా ఎదుగుతున్న మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలియచేశారు.

 

Former ZPTC officer dies in road accident