ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రంలో బుధవారం మాజీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సోమ రాజారెడ్డి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు సోమ గంగారెడ్డి తండ్రి సోమ చిన్న గంగారం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మానాల మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం నాగేంద్ర నగర్ గ్రామానికి చెందిన గుండు కార్తీక్ తండ్రి గంగాధర్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి వెంట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.