Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 8:54 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ లో చేరిన దేవన్ పల్లి మాజీ సర్పంచ్

భీమ్ గల్, బతుకమ్మ :

మండలంలోని దేవన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు దేవాయి, ఆమె భర్త గంగారాంలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోచేరారు.ఈ సందర్బంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని,సకల జనుల సంక్షేమం దిశగా పాలన సాగుతుందని,ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు బోదిరె స్వామి, కన్నె సురేందర్, కుంట రమేష్, పల్లె శేఖర్, అనంత్ రావు, గోపాల్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.