Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 5:58 pm Posted by : ramakrishna

మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి వేడుకలు 

ఆర్మూర్, బతుకమ్మ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ మండలం లోని అధ్యక్షులు గిరీష్ , డాక్టర్ అరుణ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం  గిరీష్, డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ రాజకీయ విలువలతో కూడిన గొప్ప  నాయకులు, భావితరాలకు సువర్ణ బాటలు వేసిన దార్శనికులు,ఆధునిక భారత్ కు గట్టి పునాదులు వేసిన మహాత్ములు,తన ముందుచూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో నేషనల్ హైవేస్ అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మహేష్, సుభాష్,నడిసరం మల్లయ్య,హరీష్, ప్రళయ తేజ, డాక్టర్ అరుణ్ కుమార్, మల్లయ్య, సురేష్ గౌడ్, సతీష్ , సకాలి ముత్తెన్న రాజేందర్ గంజి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.