Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 7:20 pm Posted by : ramakrishna

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు మరువలేం

నిజాంసాగర్, బతుకమ్మ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు మరువలేమని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థాపించిన మహా నేత అని ఉపాధి హామీ కూలీలు కొనియాడారు. కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  నిరుపేద ప్రజలకు పనులు లేక బతుకు దెరువు కోసం వలసలు  వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారని, తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో చర్చించి వలసలను ఆపాలని ఉద్దేశంతో నిరుపేదైన గ్రామీణ ప్రజలకు రోజువారి వేతనం చెల్లించి ఉపాధి కల్పించారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని గుర్తు చేసుకుని కూలీలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువ లేనివి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుడు చాకలి ఈశ్వర్, గొల్ల పావులు,పెంటబోయిన కిష్టయ్య, ఉపరీ శివరాజు,బొర్ర విట్టవ్వ, ఉపాధి కూలీలు ఉన్నారు.