నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాదు మాజీ నుడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి జన్మదిన వేడుకులు ఆయన స్వ గృహములో తన ఆత్మీయులతో ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం అభయ వీర ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించిన అనంతరం వారి ఇంటి దైవమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి తన స్వగృహంలో కేక్ కట్ చేసి పెళ్లిరోజు, జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా శివునికి అభిషేకాలు చేసి అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సెపక్ తక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ నాభి, బోర్గం గ్రామ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, నవనీత్ రెడ్డి, హన్మాండ్లు, చిన్నరెడ్డి, మాజీ సర్పంచ్ ఎఱ్ఱన్న, శేఖర్, పోతారెడ్డి, మోపాల్ మాజీ ఎంపిటీసి ముత్యం, నవనీతరెడ్డి, నరేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.