కౌన్సిలర్ పదవికి ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మెన్ సత్యం రాజీనామా 

 ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆలియాస్ సత్యం బుధవారం తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు..తన వ్యక్తిగత కారణాలవల్ల  రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా పత్రాన్ని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ కి అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతు.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  అనుమతి మేరకే రాజీనామా చేసినట్లు తెలిపారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ కార్యకర్తను తాను కొన్ని అనివార్య కారణాలవల్ల టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్  సేవా పథకాలు...