Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2024, 6:04 pm Posted by : ramakrishna

కార్యకర్తకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్ధిక సహాయం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్త కిరణ్ వాళ్ళ అన్న చరణ్ కి ఇటీవల అనారోగ్యంతో బ్రెయిన్ సర్జరీ చేశారు.  సోమవారం ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్న సాగర్ లోని కిరణ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు చరణ్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిరణ్ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆయనను పరామర్శించిన వారిలో మాజీ జెడ్పిటిసి సామెల్ ,తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,ఏ ఎం సి డైరెక్టర్ గంగారెడ్డి ,నిజ్జన మహేందర్,అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.