Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 9:32 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ లు

భీమ్ గల్, బతుకమ్మ : మండలం లోని పురాణీపెట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోట శంకర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం తన అనుచరులు 60మంది తో మోర్తాడ్ ప్రజానిలయం నందు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరందరికి సునీల్ కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలో కి ఆహ్వానించారు.వీరితో పాటు సికింద్రాపూర్ మాజీ ఎంపీటీసీ కుర్ర గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో 20 మంది ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.