Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 5:42 pm Posted by : ramakrishna

చీరల పంపిణీ ప్రారంభించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

  • చీరల నాణ్యత పట్ల మహిళల హర్షం వ్యక్తం
  • మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

 

ఇందల్వాయి, బతుకమ్మ : దల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, ఐకెపి డ్వాక్రా మహిల సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా శక్తి చీరలను మహిళా మణులకు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కోటి చీరలు పంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృడ సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.మొదటి విడతగా 65 లక్షల మహిళలకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పైన తప్పుడు ఆరోపణలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీసీలు,సిఏలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.