Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 7:32 pm Posted by : ramakrishna

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు అస్వస్థత

 

హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో గల ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ గా ఉందని, ఏఐజీ  ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అభిమానులు,కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. తెలంగాణ ప్రజలు,కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదం తో వేగంగా కోలుకొని తెలంగాణ సమాజానికి సేవలు అందిస్తారని పేర్కొన్నారు.