బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో బీజేపీ నాయకులు, హిందూ యువకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన విషయమై పార్టీ అధిష్టానం బెయిల్ కొరకు ప్రయత్నించి, బెయిల్ పై విడుదలైన పార్టీ కార్యకర్తలను ఆదివారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం కోసం పాటుపడే వారికి ఇటువంటి పరీక్షలు ఎదురవుతాయని అన్నారు....