బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో బీజేపీ నాయకులు, హిందూ యువకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన విషయమై పార్టీ అధిష్టానం బెయిల్ కొరకు ప్రయత్నించి, బెయిల్ పై విడుదలైన పార్టీ కార్యకర్తలను ఆదివారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం కోసం పాటుపడే వారికి ఇటువంటి పరీక్షలు ఎదురవుతాయని అన్నారు. కార్యకర్తలు భయపడకుండా, ధైర్యంగా ముందుకు సాగుతూ సమాజానికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తే ప్రజలు తప్పకుండా గుర్తుంచుకుంటారని తెలిపారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల బోగుడ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నాయకులు కోనేరు శశాంక్, బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి శివప్రసాద్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుడ్ల శ్రీనివాస్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరి, బీర్కూరు మండల అధ్యక్షులు సాయికిరణ్, పాశం భాస్కర్ రెడ్డి, చీకట్ల రాజు, కొండని గంగారం, అర్సపల్లి సాయిరెడ్డి, మోహన్ రెడ్డి, సున్నం సాయిలు, పార్టీ కార్యకర్తలు, హిందూ యువకులు తదితరులు పాల్గొన్నారు.