Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 5:00 pm Posted by : ramakrishna

న్యాయవాది కళ్యాణిని పరామర్శించిన మాజీ ఎంపీ బీబీ పటేల్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో గత కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన న్యాయవాది కళ్యాణిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడంతో ఆదివారం రోజున జహిరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆమె నివాసంలో న్యాయవాది కళ్యాణిని పరామర్శించారు. అధైర్య పడోద్దని, అండగా ఉంటామని సూచించారు. ఆయన వెంట బిజెపి పార్టీ నాయకులు ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్, పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు కటికే రామ్ రాజ్, ఏముల గజేందర్, బోజిగొండ అనిల్, కృష్ణ, పార్వతి మురళి, అంబం సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, అడప నవీన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.