బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని జలాల్ పూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ గుర్ల విమల భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్ల లక్ష్మయ్య బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బుధవారం సాయంత్రం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి లక్ష్మయ్య మృతదేహం పై పూలమాలలు వేసి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి నివాళులు అర్పించారు. గొర్ల లక్ష్మయ్య గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శోక సంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి, అన్ని విధాల వారికి అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి, జలాల్ పూర్ మాజీ సర్పంచ్ ధారబోయిన కృష్ణ, నాయకులు దుర్గారెడ్డి, శ్రీనివాస్, ఎండి ఫరీద్, బాబు రావు వంశీ కృష్ణ గౌడ్, తదితరులు ఉన్నారు.
