Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 4:51 pm Posted by : ramakrishna

మంజీరాలో చిక్కుకున్న గొర్రెల కాపరులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మద్నూర్, బతుకమ్మ: ఇటీవల వర్షాల వల్ల ప్రాజెక్టు వదిలగా మంజీరా లో చిక్కుకున్న గొర్రె కాపర్లు, 650 గొర్లు వారికీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కలిసి పలకరించారు. బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామం లో సోమవారం జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా అర్ద రాత్రి వేళల్లో వదిలిన వరద నీరు ఒకేసారి రావడం వల్లే మాకు అంత ఇబ్బంది కావడం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రతి సారి కౌలాస్ గేట్లు వదులుతారు కానీ కొద్దీ కొద్దిగా వదిలే వారు. ఈ సారి ముందస్తు సమాచారం లేకుండా ఒకేసారి వదలడం ద్వారా మేము మా జీవులు అక్కడే ఆగాల్సి వచ్చింది. మాకు అధికారులు వచ్చి మా ప్రాణాలు కాపాడరని గొర్రె ల కాపర్లు తెలిపారు. ఈ గొర్రెలే మా జీవన ఆధారం అని మాకు కెసిఆర్ ప్రభుత్వం లో కెసిఆర్  ఇచ్చిన గొర్రె ల వాళ్ళనే మా జీవనం సాగిస్తునామాని వారు తెలిపారు. ఇక ముందు వర్షకాలం ఒకే సారి గేట్లు వేత్తకుండా మా పశుకాపర్లు, గొర్రె కాపర్లు, రైతులు తెలియక పోతారు. వారికీ ప్రాణాపాయం కలుగకుండా చూడాలని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, బస్వారాజ్ పటేల్, మాజీ సర్పంచ్ సంగీత, సాయి గొండ, సంజు పటేల్, హన్మాండ్లు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.