భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వరనగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం పరామర్శించారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రభాకర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. ఈ మేరకు ఆయనను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, రమేష్, బోనాల శ్రీనివాస్, నర్సింలు, యాదగిరి, భూమలింగం, నార్సింపేట స్వామి, నవీన్ ఉన్నారు.