Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 7:41 pm Posted by : ramakrishna

అంబరీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

బతుకమ్మ, కామారెడ్డి : సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో శ్రీ అంబరీశ్వర స్వామి ఆలయాన్ని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సోమవారం  దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేదపండితుల ఆశీర్వాదం తీసుకుని, స్వామివారిని నమస్కరించి అభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, అంబరీశ్వర స్వామి క్షేత్రం పవిత్రమైన దైవస్థానం అని, భక్తుల సంకల్పాలను తీర్చే మహాక్షేత్రంగా పేరుగాంచిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ గైని అనసూయ, రమేష్, మాజీ జెడ్పిటిసి పడగల రాజేశ్వరరావు, ఉప సర్పంచ్ పసుల సాయిలు, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు గడిల దత్తు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లెపల్లి మహేందర్ రెడ్డి  పాల్గొన్నారు.