బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని బ్రహ్మంగారి మందిరం ఆవరణలో నిజాంబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల నారాయణ గురువారం నాడు మొక్కలు నాటారు. పిట్లం మండల కేంద్రంలోని బిజెపి నాయకులు పరిసర ప్రాంతాల నాయకులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని సుపరిపాలన అందిస్తున్న అందిన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అనంతరం ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుడాల గోపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంతో రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని రాష్ట్ర ప్రభుత్వంలో నిర్లక్ష్యం ధరణి అవలంబిస్తున్నారని ప్రజలకు బిజెపి అందిస్తున్న పథకాలను అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న స్థానిక ఎన్నికలలో గ్రామాలలో బిజెపి కార్యవర్గ సభ్యులు కష్టపడి సర్పంచులు వార్డ్ సభ్యులు అభ్యర్థులను గెలిపించే విధంగా సైనికుల పనిచేసే గెలిపించాలని ఆయన కోరారు. స్థానిక ఎన్నికలలో బిజెపి సత్తా చాటితేనే రాష్ట్రంలో సత్తా చాటి అవకాశం ఏర్పడుతుందని ఆయన కోరారు. బిజెపి పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.