కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి లో ఇటివల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప వర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షులుతో కలిసి గురువారం సన్మానించి సత్కరించారు. కౌన్సిల్ పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు పదిమంది కౌన్సిలర్ లను అభినందించారు. అలాగే ప్రజలు వారిపై ఉంచిన నమ్మకాన్న నిలబెట్టుకోవాలని ఆయన కౌన్సిలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్, బీఆర్ఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
