నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి, వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్గంజ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు. వినాయక్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు. 25వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల రాజు ఆహ్వానం మేరకు కోటగల్లిలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
