Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:23 pm Posted by : ramakrishna

దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్‌లో ఆదివారం భారీ విద్యుత్ దీపాల అలంకరణతో అద్భుతంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఆయన సందర్శించారు. మండపాన్ని అందంగా, ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాలతో అలంకరించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. నగరంలో ఇంత అద్భుతంగా దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం హనుమాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ 23వ డివిజన్ అధ్యక్షులు జక్క మహేష్ ఆహ్వానం మేరకు అక్కడ ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ వాతావరణంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.