అఫ్రోజ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మొహమ్మద్ అఫ్రోజ్ గత 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయం జరిగింది.అఫ్రోజ్ బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యక్రమాలలో క్రియశిలకంగా పాల్గొంటారు.అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అఫ్రోజ్ స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అఫ్రోజ్ కుటుంబానికి భరోసానిచ్చారు.