ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత
హైదరాబాద్, బతుకమ్మ : రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత రాఖీ కట్టి ఆత్మీయంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా–తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రక్షా బంధన్ వేడుకను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆకుల...