రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
బతుకమ్మ,మోర్తాడ్: పలు వివాహాది శుభకార్యాలకు వెళుతూ మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతుల దగ్గరికి వెళ్లి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి రూ. 2800 లకు కొంటాము అంటుంది.. ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు అమ్ముకుంటున్నారు అని రైతు ని ఎమ్మెల్యే అడిగారు. ఇప్పటికే కల్లాల మీదకి వచ్చి 20 రోజులవుతుంది. ప్రభుత్వం బోనస్ ఇచ్చి వడ్లు కొంటుంది అని నమ్మకం లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాం అని...