Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 5:27 pm Posted by : ramakrishna

రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ,మోర్తాడ్: పలు వివాహాది శుభకార్యాలకు వెళుతూ మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతుల దగ్గరికి వెళ్లి  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వం క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి రూ. 2800 లకు కొంటాము అంటుంది.. ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు అమ్ముకుంటున్నారు అని రైతు ని ఎమ్మెల్యే అడిగారు. ఇప్పటికే కల్లాల మీదకి వచ్చి 20 రోజులవుతుంది. ప్రభుత్వం బోనస్ ఇచ్చి వడ్లు కొంటుంది అని నమ్మకం లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాం అని రైతు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం ఎప్పుడో కొనుగోలు స్టార్ట్ చేసేది
70 శాతం పంట ఇప్పటికె ప్రవేట్ వ్యాపారులకు అమ్మేసుకున్నారు అని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు.
ఈ సందర్భంగా అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి క్వింటాలు రూ.2800 లకు కొనేలాగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించడం ఆలస్యం అయినందున ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు కూడా ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు.

Former minister Prashanth Reddy spoke to the farmers