మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు ఆత్మీయుల కుటుంబాలను గురువారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామానికి చెందిన ఆత్మీయులు గడ్డం వినోద్ రెడ్డి తల్లి కాలం చేయడంతో వారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే సుంకేట్ గ్రామానికి చెందిన విలాసాగర్ భాస్కర్ గల్ఫ్ లో ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.