- మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. డయేరియాతో ఊరు ఊరంతా మంచం పట్టిన దారుణ పరిస్థితి పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. శుభ్రమైన తాగు నీరు సరఫరాలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్ మెంట్ ఫెయిల్ అయిందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ ఫెయిల్ అయిందని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఫెయిల్ అయిందని మండి పడ్డారు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.