నిజామాబాద్, బతుకమ్మ : దివంగత మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ స్మారకార్థం నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు, నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఈ నెల 23 నుంచి ఐదురోజుల పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్ అంశాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో 150 పాఠశాలల, జూనియర్ కళాశాలలకు చెందిన 4వేల మంది బాలబాలికలు పోటీ పడుతారని తెలిపారు. మొదటి రెండు స్థానాల్లో గెలుపొందిన వారికి వ్యక్తిగత బహుమతులతో పాటు నగదు ప్రోత్సహాలు అందించడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ జయంతి ఈ నెల 27న జరుగుతాయని అదే రోజు క్రీడా పోటీల ముగింపు ఉంటుందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ముందుగానే కలెక్టరేట్ మైదానంకు చేరుకోవాలని కోరారు.