దివంగత సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
ఏర్గట్ల, బతుకమ్మ : ఇటీవల మృతి చెందిన తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పావని చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సర్పంచ్ పావని భర్త బాను, కుమారులు భవిత్, భవిన్‌లను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించా లని కోరారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా...