Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 8:56 pm Posted by : ramakrishna

దివంగత సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఇటీవల మృతి చెందిన తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పావని చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సర్పంచ్ పావని భర్త బాను, కుమారులు భవిత్, భవిన్‌లను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించా లని కోరారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తాళ్లరాంపూర్ గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి రమేష్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే గుమ్మిర్యాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ముక్కెర దేవన్న యాదవ్‌ను కలిసి ఆయన ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఏర్గట్ల మండల అధ్యక్షుడు పూర్ణానందం, ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, దొంచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు ఆసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లక్కం నరసయ్య, అంజిరెడ్డి, అశోక్ యాదవ్, గడ్డం రమేష్, బద్దం ప్రభాకర్, నేరళ్ల నరేందర్, అట్ల పోశయ్య, కూష లింబాద్రి, రోక్కెడ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

Former Minister consoles the family of the late Sarpanch.