తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన మాజీ మావోయిస్ట్ వనజక్క
హైదరబాద్, బతుకమ్మ: మాజీ మావోయిస్టు పటేల్ వనజక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం పటేల్ వనజ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మల్లన్న నియమించారు. పటేల్ వనజ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అమరుడు పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి అనే విషయం తెలిసిందే.